Justice Manavendranath Roy: మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలకపాత్ర
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:59 AM
విజయవాడలోని సిటీ సివిల్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియేషన్ సెంటర్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ...
మీడియేషన్ సెంటర్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ సూచన
విజయవాడ లీగల్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని సిటీ సివిల్ కోర్టులో ఏర్పాటు చేసిన మీడియేషన్ సెంటర్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ నూతన విధానంపై ఎన్టీఆర్ జిల్లా లీగల్‌సెల్ అథారిటీ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. శుక్రవారం వరకు ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారంలో న్యాయవాదులదే ప్రముఖ పాత్ర అన్నారు. కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కృష్ణాజిల్లా ప్రఽ దాన న్యాయమూర్తి గుట్టల గోపి మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకు 64మంది శిక్షణ పొందిన అడ్వొకేట్ మీడియేటర్లు ఉన్నారని, రెండో దశలో 35 మంది న్యాయవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌ను బెజవాడ బార్ న్యాయవాదులు జ్ఞాపికతో సత్కరించారు.