బార్ కౌన్సిల్ చైర్మన్గా బాలాజీ బాధ్యతలు స్వీకరణ
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:24 AM
ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్గా న్యాయవాది యలమంజుల బాలాజీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్గా న్యాయవాది యలమంజుల బాలాజీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రాంగణంలోని బార్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ రామిరెడ్డి, ఏపీ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ బీవీఆర్ మూర్తి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలాజీకి పుష్పగుచ్ఛాలు ఇచ్చి, అభినందనలు తెలిపారు.