జగన్ పాలనలో 10 వేల కోట్ల నిధులు పక్కదారి
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:58 AM
వైసీపీ పాలనలో రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా నిధులను పక్కదోవ పట్టించారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు.
40 వేల కోట్ల విలువైన పథకాలు నిలిచిపోయాయి: లంకా దినకర్
న్యూఢిల్లీ, జనవరి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా నిధులను పక్కదోవ పట్టించారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. బుధవారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక పోవడం వలన దాదాపు రూ.40 వేల కోట్లు విలువైన పథకాలు అమలు కాలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దాదాపు రూ.10 వేల కోట్లను పక్కదోవ పట్టించారు. ప్రస్తుతం ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ చొరవతో దేశంలోనే అత్యధికంగా మహిళా లక్షాధికారులుగా 17.50 లక్షలకు పైగా స్త్రీలు ఎదిగారు. మరో 30 లక్షల మంది త్వరలో లక్షాధికారులుగా మారుతున్నారు’ అని దినకర్ తెలిపారు.