Share News

కాంగ్రెస్‌ కూటమి తీరుతో దక్షిణాదికి నష్టం: లంకా

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:27 AM

ఉత్తర-దక్షిణ భారతదేశం అంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్ని రెచ్చగొట్టి, రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆరోపించారు.

కాంగ్రెస్‌ కూటమి తీరుతో దక్షిణాదికి నష్టం: లంకా

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఉత్తర-దక్షిణ భారతదేశం అంటూ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్ని రెచ్చగొట్టి, రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌ లంకా దినకర్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండీ కూటమి మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులపై ఇటీవల పార్లమెంట్‌లో వ్యవహరించిన తీరు వల్ల నారీశక్తికి విఘాతం కలిగిందని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తీరు దక్షిణ భారతదేశ భవిష్యత్‌కు తీరని నష్టమని అన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 04:27 AM