Share News

మహిళా వ్యతిరేక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారు

ABN , Publish Date - May 06 , 2026 | 04:34 AM

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న ప్రతి పార్టీకి తాజా అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బుద్థి చెప్పారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు.

మహిళా వ్యతిరేక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారు

  • ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌

న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న ప్రతి పార్టీకి తాజా అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు బుద్థి చెప్పారని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్‌ లంకా దినకర్‌ అన్నారు. నారీ శక్తిని చాటేందుకు ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటేశారని తెలిపారు. మంగళవారం ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయ సాధికారితలో మహిళలకు భాగస్వామ్యం కోసం చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు ‘‘నారీశక్తి వందన్‌’’ ద్వారా అవకాశం కల్పించాలని ఎన్డీయే సంకల్పిస్తే.. ఇండి కూటమి అడ్డుకుందని దీంతో దేశవ్యాప్తంగా మహిళలు వారికి బుద్థి చెబుతున్నారన్నారు. దేశ హితం కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలకు పెద్ద ఎత్తున మద్దతు దేశవ్యాప్తంగా లభిస్తోందనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు.

Updated Date - May 06 , 2026 | 04:35 AM