ప్రజలను మోసం చేసిన జగన్, కేసీఆర్: లంకా
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:12 AM
గన్, కేసీఆర్.. ఇద్దరూ కలసి తెలుగు ప్రజలను మోసం చేశారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు.
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): జగన్, కేసీఆర్.. ఇద్దరూ కలసి తెలుగు ప్రజలను మోసం చేశారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ విమర్శించారు. ‘సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. గోదావరి, కృష్ణాలోని వరద, మిగులు జలాలను వాడకునేందుకు ఏపీకి సహజ సిద్ధమైన హక్కు ఉంది. గోదావరి-నల్లమలసాగర్ అనుసంధానంతో 60 లక్షల మందికి తాగునీటిని, 10 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందిచవచ్చు. సీమ ఎత్తిపోతల పథకం పనులు జగన్ పాలనలోనే ఆగిపోయాయి. గతంలో అధికారంలో ఉన్న జగన్, కేసీఆర్‌లు తెలుగు ప్రజలను మోసం చేశారు. పోలవరంపై కేసీఆర్ అసత్య ప్రచారాలు చేస్తుంటే జగన్ కిమ్మనలేదు.’ అని దినకర్ విమర్శించారు.