లేబర్ కోడ్ విధానంతో కార్మికులకు నష్టం
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:53 AM
లేబర్ కోడ్ విధానంతో దేశవ్యాప్తంగా కార్మికులకు తీరని నష్టం కలుగుతుందని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత అన్నారు.
సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత
నంద్యాల రూరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): లేబర్ కోడ్ విధానంతో దేశవ్యాప్తంగా కార్మికులకు తీరని నష్టం కలుగుతుందని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తే సహించబోమని ఆమె హెచ్చరించారు. శుక్రవారం సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభలు నంద్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా నంద్యాల పట్టణంలోని టెక్కె మార్కెట్‌యార్డు నుంచి మున్సిపల్ టౌన్ హాల్ వరకు కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం బహిరంగ సభలో హేమలత మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ విధానం అమలులోకి వస్తే కార్మికులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గత 12 సంవత్సరాలుగా వేతనాలను సవరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.