Share News

కూలీల ఆటో బోల్తా

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:30 AM

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి 11 మంది గాయపడిన ఘటన నాగాయలంకలో గురువారం జరిగింది.

కూలీల ఆటో బోల్తా

- 11 మందికి గాయలు

- అవనిగడ్డ, మచిలీపట్నం ఆస్పత్రులకు తరలింపు

నాగాయలంక, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి):

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి 11 మంది గాయపడిన ఘటన నాగాయలంకలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని గణపేశ్వరం గ్రామానికి చెందిన సుమారు 15 మంది కూలీలు మేస్త్రీ కోన రమేశ్‌ ఆధ్వర్యంలో మొక్కజొన్న కోత పనుల నిమిత్తం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం, పెదపులిపర్రు బుధవారం సాయంత్రం వెళ్లారు. రాత్రంతా మొక్కజొన్న మిల్లు పనులు పూర్తి చేసుకుని గురువారం ఉదయం 5.00 గంటలకు తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. డ్రైవర్‌ చాట్రగడ్డ సాంబశివరావు ఆటో నడుపుతున్నాడు. ఉదయం 6.30 గంటలకు నాగాయలంక సాయిబాబా ఆలయం సమీపంలోకి రాగానే వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బత్తుల బుజ్జి, బత్తుల నాంచారమ్మ, చాట్రగడ్డ కృష్ణ, దాసరి మరియమ్మ, చాట్రగడ్డ భిక్షం, బత్తుల వెంకటేశ్వరరావు, మెరుగు మహేశ్వరి, గుంటూరు కుమారి, చాట్రగడ్డ దుర్గాశ్రీ, చాట్రగడ్డ వాణి, డ్రైవర్‌ చాట్రగడ్డ సాంబశివరావు గాయపడ్డారు. వీరిని వెంటనే అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అవనిగడ్డ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఏఎంసీ చైర్మన్‌ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలు మంచాల బాబు, మహేంద్ర కుమార్‌, బలుసుపల్లి రత్నకుమార్‌ పరామర్శించారు. ఈ ఘటనపై నాగాయలంక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated Date - Apr 17 , 2026 | 12:30 AM