లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:04 AM
కేంద్రంలో మోదీ ప్రభు త్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలపై పోరాటం చేస్తామని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ, రైతు, విద్యా ర్థి, యువజన, ఉద్యోగ సంఘ నాయకులు స్పష్టం చేశారు.
ఆదోని అగ్రికల్చర్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : కేంద్రంలో మోదీ ప్రభు త్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధా నాలపై పోరాటం చేస్తామని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ, రైతు, విద్యా ర్థి, యువజన, ఉద్యోగ సంఘ నాయకులు స్పష్టం చేశారు. గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదోనిలో వామపక్ష పార్టీ కార్మిక సంఘాలు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్‌బాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్పులు చేయడం దుర్మార్గమన్నారు. కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. స్కీం వర్కర్లకు అంగనవాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకు ఎల్‌ఐసీ రైల్వే పోస్టల్ శాఖలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు ఐఎ్‌ఫటీయూ జిల్లా నాయకుడు నరసన్న ఏపీ ఎనజీవో అధ్యక్షురాలు ఉషారాణి, బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడు నాగరాజు, అంగనవాడీ వర్కర్స్ యూనియన రాష్ట్ర నాయకురాలు వరలక్ష్మి, నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్మికుల జోలికొస్తే పుట్టుగతులుండవ్
పత్తికొండ టౌన్: పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాసే ప్రభుత్వాలకు పుట్టుగతులు ఉండవని సీపీఐ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌లు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం పత్తికొండలో ఎంపీడీవో కార్యాలయం నుంచి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీ ని ర్వహిస్తూ నాలుగు స్తంభాల కూడలి వద్ద కు చేరుకున్నారు. అక్కడ ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. మోదీ ప్రభుత్వం 44 కా ర్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి కార్మికుల హక్కులను కాల రాస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కార్యక్రమంలో ఆయా ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయం ముందు..
సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉద్యోగ జే ఏసీ పిలుపు మేరకు పత్తికొండ ఆర్డీవో కా ర్యాలయం ఎదుట గురువారం ఉద్యోగ, ఉ పాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవోకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ, ఎన్‌జీవో, పెన్షనర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఆలూరులో కార్మికుల భారీ ప్రదర్శన
ఆలూరు: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలంటూ ఆలూరులో గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. స్థానిక గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు సంఘం, బీకేఎంయూ , ఏపీయూడబ్ల్యూజే, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లను రద్దుచేయాలి
వెల్దుర్తి : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వెల్దుర్తిలో సీఐటీయూ జిల్లా నా యకుడు గురుశేఖర్, ఏఐటీయూసీ మం డల నాయకుడు మాధవస్వామి ఆధ్వర్యం లో కార్మికులు సమ్మె నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎస్‌బీఐ స ర్కిల్ మీదుగా పాతబస్టాండ్ కూడలి వర కు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కూడలిలో మానవహారం చేపట్టారు. అనుబంధ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
దేవనకొండలో ర్యాలీ
దేవనకొండ: లేబర్‌కోడ్‌లను రద్దు చే యాలని దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భా గంగా దేవనకొండలో వామపక్షపార్టీల ఆ ధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక పో లీ్‌సస్టేషన నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేసి, బస్టాండ్ అవరణంలో రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం నాయకులు, అంగనవాడీలు పాల్గొన్నారు.
మద్దికెరలో రాస్తారోకో
మద్దికెర: మద్దికెరలో బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సీపీఐ కార్యదర్శి నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కోదండ రాముడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలొ సీపీఐ నాయకులు నెట్టికంటయ్య, బొజ్జన్న, తదితరులున్నారు.