కువైత్ వీసాల పేరుతో మోసాలు.. రంగంలోకి సీబీఐ
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:07 AM
కువైత్ ఈ-వీసా, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాల పేరుతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిరుద్యోగులను మోసగిస్తున్న సైబర్ నేరస్థుల ముఠా ఆటకట్టించేందుకు సీబీఐ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
కువైత్ ఈ-వీసా, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాల పేరుతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిరుద్యోగులను మోసగిస్తున్న సైబర్ నేరస్థుల ముఠా ఆటకట్టించేందుకు సీబీఐ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ముఠా కువైత్ ప్రభుత్వం పేరిట ఒక నకిలీ వెబ్‌సైట్ నిర్వహిస్తూ అమాయకులకు వల వేస్తోంది. ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో సభ్యులను నియమించుకుని వీసాల పేర దండుకున్న సొమ్మును విదేశాలకు తరలిస్తోందని అధికారులు గుర్తించారు. అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్, సింగపూర్ దేశాల్లో కూడా ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు పాల్పడుతోందని గుర్తించి.. ఇంటర్‌పోల్ సాయంతో ఆయా దేశాల పోలీసుల సమన్వయంతో ‘ఆపరేషన్ స్ట్రయిక్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది.