Share News

109 రోజులకు చేరిన రిలే నిరాహార దీక్షలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:05 AM

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 109 రోజులకు చేరాయి.

 109 రోజులకు చేరిన రిలే నిరాహార దీక్షలు
రిలే నిరాహార దీక్ష చేస్తున్న శ్రీశైలం నిర్వాసితులు

నందికొట్కూరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 109 రోజులకు చేరాయి. శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల సంఘం నాయకులు జయన్న మాట్లాడుతూ 2017,2019, 2024 బహిరంగ సభల్లో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం కల్పించి న్యాయం చేస్తామన్నారు. కానీ ఇంత వరకు ఏ ప్రభుత్వం కూడా తమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రభుత్వం స్పందించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగేంద్ర, నాగసుంకన్న, నాగరాజు, నారాయణ, జమ్మన్న, మౌలాలి, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 12:05 AM