Share News

మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:11 PM

మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు సహకరించాలని మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి
ప్రత్యేక అధికారిణిగా బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌

మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల టౌన్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు సహకరించాలని మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. బుధవారం ఆమె నంద్యాల మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ. పట్టణ మౌలిక సదుపాయాలు, పారిఽశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా రోడ్ల అభివృద్ధి ఆదాయ వనరులు పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని సూ చించారు. ప్రజలకు వేగంగా పారదర్శకంగా సేవలందించాలన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. కార్యాలయం అంతా తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగ పంపిణీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ బండి శేషన్న, ఎంఈ గురప్పయాదవ్‌, ఎస్‌ఎస్‌ మురళి, డీఈ నాగభూషణంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

పోలీసుల అప్రమత్తంగా ఉండాలి

నంద్యాల ఎడ్యుకేషన్‌: ఈవీఎం గోదాముల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. బుధవారం టెక్కె మార్కెట్‌యార్డులోని ఈవీఎం గోదాములను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌తో పాటు నోడల్‌ ఆఫీసర్‌ ఆంజనేయులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాములను పరిశీలిం చామన్నారు. డీఆర్వో రామునాయక్‌, ఆర్డీవో విశ్వనాధ్‌, జిల్లా ఈవీఎం నోడల్‌ అధికారి గుణభూషణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:11 PM