సొంతూరికి చందు మృతదేహం
ABN , Publish Date - May 06 , 2026 | 04:50 AM
అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న కర్నూలు యువకుడు ఇరగనబోయిన చందు(26) మృతదేహం సొంతూరుకు చేరుకుంది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని స్వగ్రామమైన...
ఉద్యోగం రాదేమోనని గతనెల 28న అమెరికాలో ఆత్మహత్య
శిరివెళ్ల, మే 5(ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న కర్నూలు యువకుడు ఇరగనబోయిన చందు(26) మృతదేహం సొంతూరుకు చేరుకుంది. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని స్వగ్రామమైన వీరారెడ్డిపల్లెలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇరగనబోయిన కేశవ కుమారుడు చందు అమెరికా, షికాగోలోని డీపాల్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశాడు. గత కొన్ని నెలలుగా అమెరికాలో నెలకొన్న పరిస్థితుల వల్ల తనకు ఉద్యోగం రాదన్న అభద్రత, కుటుంబానికి భారమవుతానేమోనన్న ఆందోళనతో గత నెల 28న తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తెలిసిన వెంటనే మంత్రి లోకేశ్ స్పందించారు. కుటుంబం సభ్యులను ఓదార్చి మృతదేహాన్ని వీలైనంత త్వరగా సొంతూరుకు తీసుకొని రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, తానా ‘టీం స్క్వేర్’ ప్రతినిధులతో మాట్లాడి మృతదేహం స్వగ్రామానికి రావడానికి కృషి చేశారు.