Share News

కుప్పానికి జాతీయ గుర్తింపు ఆనందాన్నిచ్చింది: సీఎం

ABN , Publish Date - May 11 , 2026 | 04:47 AM

కుప్పంలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

కుప్పానికి జాతీయ గుర్తింపు ఆనందాన్నిచ్చింది: సీఎం

అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): కుప్పంలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో గుర్తింపు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. నానాజీ దేశ్‌ముఖ్‌ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ -2025 కింద దేశంలో కుప్పం మూడో స్థానాన్ని సాధించి రూ.1.50 కోట్లు నగదు బహుమతి గెలుచుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆదివారం ‘ఎక్స్‌’లో తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి నియోజకవర్గాన్ని దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుపుదామని పిలుపిచ్చారు.

Updated Date - May 11 , 2026 | 04:48 AM