గుచ్చిమి ఎలిఫెంట్ జోన్‌కు చేరిన కుంకీలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 05:02 AM
పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రత్యేక వాహనాల్లో జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులు శనివారం జిల్లాకు వచ్చాయి.
మరో పది రోజుల్లో ఆపరేషన్ ప్రారంభం
సీతానగరం, జూలై 25(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాకు కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి ప్రత్యేక వాహనాల్లో జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులు శనివారం జిల్లాకు వచ్చాయి. వాటిని సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వ్ ఫారెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ జోన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు కుంకీలకు ఘన స్వాగతం పలికారు. కుంకీల సాయంతో మన్యం జిల్లాలో సంచరిస్తున్న 12 ఏనుగుల గుంపును కట్టడి చేసి ఎలిఫెంట్ జోన్‌ను తరలిస్తామని చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఐకేవీ రాజు, డీఎ్‌ఫవో ప్రసూన తెలిపారు. ఏనుగుల గుంపు నుంచి ఆస్తి, పంట, ప్రాణ నష్టాలను నివారించేందుకు కుంకీలను ఉపయోగించనునున్నామని వెల్లడించారు. మరో పది రోజుల్లో ఆపరేషన్ ప్రారంభిస్తామని చెప్పారు.