Share News

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

ABN , Publish Date - Mar 09 , 2026 | 05:12 AM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత నెలలో జరిగిన కల్తీ పాల ఘటనలో మరొకరు మృతిచెందారు. మూత్రపిండాల వైఫల్యంతో ఎస్‌.రామలక్ష్మి....

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

  • 11కు చేరిన మృతుల సంఖ్య

రాజమహేంద్రవరం, మార్చి 8(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత నెలలో జరిగిన కల్తీ పాల ఘటనలో మరొకరు మృతిచెందారు. మూత్రపిండాల వైఫల్యంతో ఎస్‌.రామలక్ష్మి (73) ఆదివారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. వారిలో ఆరుగురు మహిళలు ఉండగా, ఆరేళ్ల బాలుడుసహా ఐదుగురు పురుషులున్నారు. ఇంకా 9 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదు నెలల పాప, ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలురతో కలిపి మొత్తం ఆరుగురు పురుషులు చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురు డయాలసిస్‌ వైద్యం పొందుతుండగా, మిగతా ఐదుగురు వెంటిలేటర్‌పై డయాలసిస్‌ వైద్యం పొందుతున్నారు. ముగ్గురు పిల్లల్లో ఐదు నెలల పాపకు డయాలసిస్‌ చేస్తుండగా మిగతా ఇద్దరు పిల్లలు డయాలసి్‌సతోపాటు వెంటిలేటర్‌పై వైద్యం పొందుతున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 05:12 AM