‘కూచిపూడి’కి అవార్డుల పంట
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:15 AM
కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-25వ సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల జాబితాలో ముగ్గురు కూచిపూడి కళాకారులకు చోటు దక్కింది.
కేంద్ర సంగీత నాటక అకాడమీ జాబితాలో ముగ్గురికి చోటు
కూచిపూడి, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024-25వ సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల జాబితాలో ముగ్గురు కూచిపూడి కళాకారులకు చోటు దక్కింది. ప్రతిష్టాత్మకమైన ఫెలో అవార్డు (అకాడమీ రత్న) కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు పసుమర్తి రత్తయ్య శర్మను వరించింది. ఈ అవార్డు కింద రత్తయ్య శర్మకు రూ.మూడు లక్షల నగదు, తామ్ర పత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందించి సత్కరించనున్నారు. అలాగే బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డుకు ఇద్దరు కూచిపూడి కళాకారులు ఎంపికయ్యారు. వేదాంతం సిద్దేంద్ర వరప్రసాద్ (కూచిపూడి నాట్యం), పసుమర్తి పావని (సంగీతం) ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ.25 వేల నగదు, తామ్ర పత్రాన్ని అందించి సత్కరిస్తారు. వీరు ముగ్గురు కూచిపూడికి చెందిన కళాకారులు కావటంతో నాట్య కళాభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.