శ్రీశైలంలో కేఆర్‌ఎంబీ బృందం
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:22 AM
తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం డ్యాంను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం మంగళవారం పరిశీలించింది.
శ్రీశైలం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం డ్యాంను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం మంగళవారం పరిశీలించింది. కుడి, ఎడమ గట్ల భూగర్భ విద్యుత్ కేంద్రాల్లో పర్యటించి.. రెండు రాష్ట్రాలూ ఏడాది కాలంగా ఉత్పత్తి చేసిన విద్యుత్, జలవినియోగం వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంది. ఈ బృందంలో కేఆర్‌ఎంబీ చైర్మన్ శుభ్రాంశు బిశ్వాస్, సభ్యుడు కేకే జాంగిర్, డీఈఈ జి.పవన్నాథ్ ఉన్నారు. రిజర్వాయర్ సామర్థ్యం, గరిష్ఠ స్థాయి నీటి నిల్వ, ప్రస్తుత నీటి నిల్వతోపాటు క్రస్ట్‌గేట్లు, ప్లంజ్‌పూల్, లిఫ్టింగ్ రోప్స్, గ్యాలరీ మొదలైనవాటిని పరిశీలించారు. అధికారుల నుంచి సమగ్ర నివేదికలు తీసుకున్నారు.