కేంద్ర మంత్రిని కలిసిన కృష్ణమ్మ
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:50 PM
జిల్లాకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి కింజారపు రామ్మోహన్‌నాయుడిని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గు డిసె కృష్ణమ్మ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఆదోని, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి కింజారపు రామ్మోహన్‌నాయుడిని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గు డిసె కృష్ణమ్మ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భం గా కర్నూలు జిల్లాల ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నాయకులు చర్చించినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ శ్రేణులను సమన్వయం చే సుకుంటూ ముందుకు సాగడం, రాబో యే కాలంలో పార్టీ బలోపేతం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. యువనేత రామ్మోహన్‌నాయుడు మార్గదర్శకంలో జిల్లాలో పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు.
దేవనకొండ: వర్షాభావ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ మండల నాయకులు బడిగింజల రంగన్న, ఆకుల వీరేష్ కోరారు. మంగళవారం కర్నూలు పర్యటనకు విచ్చేన కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహననాయుడుని ఓర్వకల్లు విమానశ్రయం వద్ద కర్నూలు ఎంపీ నాగరాజుతో కలిసి వారు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కోటకొండ ప్రభాకర్, తదితరులు ఉన్నారు.