Share News

వేసవి దాహం తీర్చేలా...!

ABN , Publish Date - May 13 , 2026 | 05:30 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవిలో తాగునీటి అవసరాలు.. దాహార్తిని తీర్చేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్‌లో ...

వేసవి దాహం తీర్చేలా...!

  • సాగర్‌ నుంచి ఏపీకి 10, తెలంగాణకు 16 టీఎంసీలు

  • కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ నిర్ణయం

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవిలో తాగునీటి అవసరాలు.. దాహార్తిని తీర్చేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్‌లో 510 అడుగుల వద్ద కుడి ప్రధానకాలువ నుంచి ఏపీకి పది టీఎంసీలు, ఎడమ ప్రధాన కాలువ నుంచి తెలంగాణకు 16 టీఎంసీలు విడుదల చేయాలని బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అలాగే శ్రీశైలం జలాశయం 810 అడుగుల వద్ద 5 టీఎంసీలను హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు ఇవ్వాలని నిశ్చయించింది. మంగళవారం హైదరాబాద్‌ జలసౌధలో బోర్డు సభ్య కార్యదర్శి సతీశ్‌ కాంభోజ్‌, ఏపీ జలశాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి, తెలంగాణ జల శాఖ ఈఎన్‌సీ రమేశ్‌కుమార్‌ సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు.

Updated Date - May 13 , 2026 | 05:30 AM