Share News

ఎడారి కాదు... జీవనది కృష్ణమ్మ దుస్థితి!

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:34 AM

ఇది ఎడారి కాదు. బీడు, బంజరు భూమి కానే కాదు. జీవనదిగా పేరొందిన కృష్ణానదిలో ఓ భాగం ఇది. ఎన్‌టీఆర్‌ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన ఉన్న చందర్లపాడు..

ఎడారి కాదు... జీవనది కృష్ణమ్మ దుస్థితి!

ఇంటర్నెట్ డెస్క్: ఇది ఎడారి కాదు. బీడు, బంజరు భూమి కానే కాదు. జీవనదిగా పేరొందిన కృష్ణానదిలో ఓ భాగం ఇది. ఎన్‌టీఆర్‌ జిల్లాలో ప్రకాశం బ్యారేజీ ఎగువన, పులిచింతల ప్రాజెక్టు దిగువన ఉన్న చందర్లపాడు, కంచికచర్ల మండలాల పరిధిలో నది ప్రవహించే ప్రాంతం ఇది. చూద్దామన్న చుక్కనీరు లేని పరిస్థితి నేడు నెలకొంది. సంవత్సరాల తరబడి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరపటంతో చెట్లు, పొదలతో ఏడారి ప్రాంతంగా మారింది ఈ నది. ప్రస్తుత వర్షాకాలంలో సైతం చుక్క నీరు లేక వెలవెలపోతోంది. దీంతో రెండు మండలాల్లో తీరం వెంబడి పదుల సంఖ్యలో ఉన్న ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది.

- కంచికచర్ల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jul 16 , 2026 | 05:35 AM