Share News

పిడుగుపాటుకు సెల్‌ఫోన్‌ పేలి కౌలురైతు మృతి

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:43 AM

పిడుగుపాటుకు సెల్‌ఫోన్‌ పేలిపోయి, కౌలురైతు మరణించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం గారపాడులో బుధవారం ఈ ఘటన జరిగింది.

పిడుగుపాటుకు సెల్‌ఫోన్‌ పేలి కౌలురైతు మృతి

  • కృష్ణా జిల్లా గారపాడులో ఘటన

ఆగిరిపల్లి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు సెల్‌ఫోన్‌ పేలిపోయి, కౌలురైతు మరణించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం గారపాడులో బుధవారం ఈ ఘటన జరిగింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కృష్ణవరం గ్రామానికి చెందిన ప్రసాద్‌(35) గారపాడులో కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవడంతో బుధవారం వరి విత్తనాలు నారుమడిలో చిమ్మడానికి వెళ్లారు. పొలంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతుండగా ఉరుములు, మెరుపులతో వేరే చోట పిడుగు పడింది. అదే సమయంలో వైబ్రేషన్‌కు గురై సెల్‌ఫోన్‌ పేలిపోయింది. చెవుల నుంచి రక్తం వచ్చి ప్రసాద్‌ కింద పడిపోగా, పొరుగు రైతులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 03:44 AM