రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:13 AM
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) జరుగనుంది.
తిరుమల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) జరుగనుంది. ఈనెల 19వ తేదీ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం జరగనున్న క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం శ్రీవారి గర్భాలయం, ఉప ఆలయాలు, గోడలు, పైకప్పు, పూజా సామగ్రిని శుద్ధి చేసి పవిత్ర జలాన్ని ప్రోక్షణం చేయనున్నారు.