Share News

కోటప్పకొండ రోడ్డు ప్రారంభం

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:32 AM

త్రికోటేశ్వరస్వామి భక్తులకు పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ-కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్‌ నిధులు రూ.3.9 కోట్లతో 8 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని ప్రారంభించారు.

కోటప్పకొండ రోడ్డు ప్రారంభం

త్రికోటేశ్వరస్వామి భక్తులకు పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ-కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్‌ నిధులు రూ.3.9 కోట్లతో 8 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే అరవింద్‌బాబు అర్జీ ఇవ్వగా.. శివరాత్రి ఉత్సవాలలోపు నిర్మిస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చారు. ఈ రోడ్డుతో సుమారు లక్షన్నర మంది భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. పవన్‌కు అరవిందబాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుంచి కోటప్పకొండ ఆలయం వరకు, ఆలయం నుంచి నూతన రహదారి ప్రారంభోత్సవం వరకు పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు రోడ్డుకి ఇరువైపులా నిలబడి పవన్‌కు స్వాగతం పలికారు.

Updated Date - Jan 23 , 2026 | 05:15 AM