డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:46 AM
ముఖ్యమంత్రిగా రెండు లక్షలకుపైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన రికార్డు చంద్రబాబుదేనని, డీఎస్సీపై మాట్లాడే అర్హత...
విజయనగరం, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా రెండు లక్షలకుపైగా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసిన రికార్డు చంద్రబాబుదేనని, డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులను వైసీపీ దగా చేసిందన్నారు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఎందుకు భర్తీ చేయలేదో ఆ పార్టీ కార్యకర్తలే జగన్‌ను నిలదీయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలోనే 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించి, భర్తీ చేశామన్నారు. డీఎస్సీలో అక్రమాలు అని వైసీపీ ప్రచారం చేస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో వైసీపీ ఫెయిల్ అయ్యిందని, యువకులు, నిరుద్యోగులు జగన్‌ని ఎప్పుడూ నమ్మరని తెలిపారు. పనిపాటలు లేని వైసీపీ నాయకులు.. డీఎస్సీలో అక్రమాలు అంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.