టీ-ఎమ్మెల్యే శామ్యూల్ మాటలు హాస్యాస్పదం
ABN , Publish Date - May 29 , 2026 | 04:14 AM
తెలుగువారి మధ్య విభేదాలు సృష్టించేలా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం ఆయన ....
విభేదాలు సృష్టించేలా నాగేశ్వర్ మాటలు: మంత్రి కొండపల్లి
విజయనగరం, మే 28(ఆంధ్రజ్యోతి): తెలుగువారి మధ్య విభేదాలు సృష్టించేలా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం ఆయన విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గజపతినగరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో జరిగిన మహానాడులో పాల్గొన్నారు. తెలుగువారి ఐక్యతను ఓర్వలేని తెలంగాణ ఎమ్మెల్యే శామ్యూల్ వంటి వారు విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బొండపల్లి మండలం దేవుపల్లిలో కార్యకర్తలతో మమేకమయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తప్పెటగుళ్లు కళాకారులతో కలసి ఆయన నృత్యం చేశారు.