కొండపల్లి బొమ్మ భళా!
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:33 AM
పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల పండుగ...
రెండోరోజూ సందడిగా బొమ్మల పండుగ
విజయవాడ(ఇబ్రహీంపట్నం), ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, జిల్లా యంత్రాంగం, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల పండుగ రెండోరోజూ(ఆదివారం) ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో సుమారు 250 మంది కళాకారులతో నిర్వహించిన కార్నివాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్నివాల్‌ను ఎంపీ కేశినేని చిన్ని, ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్మన్ తేజస్విని, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 400ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొండపల్లి పేరుతో నియోజకవర్గం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పాన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో కొండపల్లిని సందర్శించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొం డపల్లి కోటపైకి మెట్ల మార్గం ద్వారా ట్రెక్కింగ్ చేసి, ఘాట్‌రోడ్డు ద్వారా కిందకు దిగాలని సూచించారు.