Share News

భూగర్భజల డైరెక్టర్‌గా శాస్త్రి బాధ్యతలు

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:16 AM

రాష్ట్ర భూగర్భజల శాఖ, జలగణన శాఖ కొత్త డైరెక్టర్‌గా కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి సోమవారం బాధ్యతలు చేపట్టారు.

భూగర్భజల డైరెక్టర్‌గా శాస్త్రి బాధ్యతలు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భూగర్భజల శాఖ, జలగణన శాఖ కొత్త డైరెక్టర్‌గా కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న శాస్త్రికి పదోన్నతి కల్పించి డైరెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Apr 21 , 2026 | 05:17 AM