కోమటి జయరాం బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:17 AM
రాష్ట్ర ప్రభుత్వం తరఫున నార్త్ అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం గురువారం బాధ్యతలు స్వీకరించారు.
నార్త్ అమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియామకం
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తరఫున నార్త్ అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం గురువారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లి ఏపీఎన్నార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి జయరాం కృషి చేస్తారని అన్నారు. ఏపీఎన్నార్టీ అధ్యక్షుడు వేమూరి రవి, సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ రవి మండలపు పాల్గొన్నారు.