సీబీఐ క్లీన్‌చిట్ చూపిస్తే రాజీనామా: కొలుసు
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:19 AM
‘తిరుమల లడ్డూ కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్టు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ చేశారు.
గుడివాడ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ‘తిరుమల లడ్డూ కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్టు నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా’ అని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్‌టీఆర్, బసవతారకం విగ్రహాల చెంత పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ అధ్యక్షతన టీడీపీ జిల్లా కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘తిరుమల లడ్డూ విషయంలో క్లీన్ చిట్ ఎక్కడ నుంచి తెచ్చారో మాజీ మంత్రి పేర్ని నాని చెప్పాలి, చూపించాలి. ఆయన కోనేరు సెంటర్‌కు వస్తానన్నా... విజయవాడ సెంటర్‌కు వస్తానన్నా నేను సిద్ధం’ అని సవాల్ విసిరారు.