Share News

ఎక్సైజ్‌ శాఖను గాడిలో పెట్టాం: కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:54 AM

గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఎక్సైజ్‌ శాఖను తిరిగి గాడిలో పెట్టామని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం, ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘాలు రూపొందించిన....

ఎక్సైజ్‌ శాఖను గాడిలో పెట్టాం: కొల్లు రవీంద్ర

  • ఎక్సైజ్‌ అధికారుల సంఘాల డైరీల ఆవిష్కరణ

అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ఎక్సైజ్‌ శాఖను తిరిగి గాడిలో పెట్టామని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం, ఎగ్జిక్యూటివ్‌ అధికారుల సంఘాలు రూపొందించిన డైరీలు, క్యాలెండర్‌లను గురువారం మంగళగిరిలోని కమిషనర్‌ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖను నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం ఆ శాఖను తిరిగి ప్రక్షాళన చేసిందని తెలిపారు. నవోదయం కార్యక్రమం ద్వారా రాష్ర్టాన్ని నాటుసారా రహితం చేశామన్నారు. నాటుసారా నిర్మూలన విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. కాగా, దేశంలో నాటుసారా రహితంగా మారిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తెలిపారు. త్వరలో ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేవ్‌ శర్మ, అదనపు కమిషనర్‌ దేవకుమార్‌, సంఘాల ప్రతినిధులు బి.నరసింహులు, కె.కామేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 04:54 AM