Share News

బూతులు మాట్లాడే చెత్త నాయకులే జగన్‌కు కీలకం: కొల్లు

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:08 AM

‘బూతులు తిట్టి... రెచ్చగొట్టి, చివరికి తన్నులు తిన్నవారి పరామర్శకు వెళ్లే దుస్థితికి జగన్‌ దిగజారాడు.

బూతులు మాట్లాడే చెత్త నాయకులే జగన్‌కు కీలకం: కొల్లు

అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘బూతులు తిట్టి... రెచ్చగొట్టి, చివరికి తన్నులు తిన్నవారి పరామర్శకు వెళ్లే దుస్థితికి జగన్‌ దిగజారాడు. ఇలాంటి పరామర్శల ద్వారా ఆ విద్వేష చర్యల వెనుక తానే ఉన్నానని జగన్‌ చాటుకుంటున్నారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘తెనాలిలో బ్లేడ్‌ బ్యాచ్‌ పరామర్శకు వెళ్లి తాను అలాంటి వారినే ప్రోత్సహిస్తాననే సందేశమిచ్చిన వ్యక్తి జగన్‌. వైసీపీ నేతల బూతుల వల్లే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయింది. అయినా జగన్‌ గ్యాంగ్‌కు బుద్ధి రావడం లేదు. గంట, అరగంట అంటూ నిస్సిగ్గుగా మాట్లాడిన వారికి, చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత జగన్‌ది. ఇలాంటి చెత్త నాయకులే జగన్‌కు కీలకం. ఇప్పటికీ వైసీపీ వారి బుద్ధి మారకుంటే ఆ పార్టీ అధోగతి పాలవ్వడం ఖాయం’ అని కొల్లు మండిపడ్డారు. కాగా, ప్రజల సమస్యలను గాలికొదిలేసి కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకే జగన్‌ యాత్రల పేరుతో డ్రామా చేస్తున్నారని ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ అన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 04:08 AM