జగన్ క్రిమినల్ క్రెడిట్‌ను చోరీ చేయలేరు: కొల్లు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:54 AM
జగన్ క్రిమినల్, దోపిడీ, విధ్వం సం, అవినీతి క్రెడిట్‌ను ఎవ్వరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): జగన్ క్రిమినల్, దోపిడీ, విధ్వం సం, అవినీతి క్రెడిట్‌ను ఎవ్వరూ చోరీ చేయలేరని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ‘రాష్ట్రానికి రాజధాని ఉండటం వైసీపీ నేతలకు ఇష్లం లేదు. జగన్‌ది క్రిమినల్ క్రెడిట్ అయితే చంద్రబాబుకి అభివృద్ధి క్రెడిట్. అమరావతిపై వైసీపీ ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడుతోంది. జగన్ చరిత్ర హీనుడు’ అన్నారు.