ఏపీఎంసీ ఎన్నికల్లో టాపర్ కోల అలేఖ్య
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:52 AM
ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఏపీ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికల్లో కోల అలేఖ్య 10,293 ఓట్లు సాధించి ప్రఽథమ స్థానంలో నిలిచారు...
బొల్ల మౌనిక, మనీ్‌షకు ద్వితీయ.. తృతీయ స్థానాలు
అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఏపీ వైద్య మండలి (ఏపీఎంసీ) ఎన్నికల్లో కోల అలేఖ్య 10,293 ఓట్లు సాధించి ప్రఽథమ స్థానంలో నిలిచారు. 10,189 ఓట్లతో బొల్ల మౌనిక ద్వితీయ, 10,123 ఓట్లతో మనీశ్ మండల తృతీయ స్థానాల్లో నిలిచారు. మొత్తం 13 సభ్యులుగా ఎన్నికయ్యారని ఆరోగ్యశాఖ సెక్రటరీ సౌరబ్ గౌర్ తెలిపారు.
ఎన్నికైన సభ్యులు వీరే : కోల అలేఖ్య, బొల్ల మౌనిక, మనీష్ మండల ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా.. మంతిని వినోద్‌కుమార్ (9,857), అరవ వెంకట సుబ్బారెడ్డి (9,174), ఓ.శివమౌర్య గుప్త (8,894), ఇసుకపల్లి వాణి (8,819), ఎం.వెంకటరమణ (8,632), మెట్ల జయచంద్రారెడ్డి (8,494), బొలెం తేజీ నవీన్ (7,820), గార్లపాటి నంద కిశ్‌ర్ (7,705), శ్రీహరి కరువ (7,553), కార్తీక్‌తుమ్మల (7,154) సభ్యులుగా ఎన్నికయ్యారని తెలిపారు.