Share News

దక్షిణ కోస్తా జోన్‌ పీసీసీఎంగా సాంబశివరావు

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:24 AM

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీసీసీఎం)గా కోగంటి సాంబశివరావును నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీచేసింది.

దక్షిణ కోస్తా జోన్‌  పీసీసీఎంగా సాంబశివరావు

విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (పీసీసీఎం)గా కోగంటి సాంబశివరావును నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ఆయన దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. ఇకపై ఆయన విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తారు. ఇప్పటివరకు దక్షిణ కోస్తా జోన్‌లో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ (కోఆర్డినేటింగ్‌)గా వ్యవహరించిన డి.సత్యనారాయణకు తగిన కేడర్‌ పోస్టు ఇవ్వాలని బోర్డు సూచించింది. దీనిపై ఇక్కడి జీఎం నిర్ణయం తీసుకుంటారు.

Updated Date - Jun 03 , 2026 | 04:24 AM