Share News

మళ్లీ మెరిసిన కియ

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:39 AM

కార్ల ఉత్పత్తిలో దూసుకెళ్తూ.. మరోవైపు ప్లాంట్‌లో సానుకూల పని వాతావరణాన్ని కల్పిస్తున్న కియ కార్ల తయారీ సంస్థ వరుసగా రెండో ఏడాదీ...

మళ్లీ మెరిసిన కియ

  • వరుసగా రెండోసారి ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ సర్టిఫికెట్‌

పెనుకొండ రూరల్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): కార్ల ఉత్పత్తిలో దూసుకెళ్తూ.. మరోవైపు ప్లాంట్‌లో సానుకూల పని వాతావరణాన్ని కల్పిస్తున్న కియ కార్ల తయారీ సంస్థ వరుసగా రెండో ఏడాదీ ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి సమీపంలో ఏర్పాటైన కియ కార్ల తయారీ పరిశ్రమ.. ఈ ఏడాది కూడా ఈ సర్టిఫికెట్‌ను అందుకున్నట్టు కియ ఇండియా సీఈవో గ్వాంగ్‌ లీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశంలో ప్రముఖ మాస్‌ ప్రీమియం కార్ల తయారీ సంస్థల్లో కియ ఇండియా ఒకటి. 2017 ఏప్రిల్‌లో యర్రమంచి వద్ద ఈ ప్లాంట్‌ ప్రారంభమైంది. ఈ ప్లాంట్‌ నుంచి ఇప్పటివరకు తొమ్మిది రకాల వాహనాలను మార్కెట్‌లోకి తెచ్చామని గ్వాంగ్‌ లీ తెలిపారు. ఇప్పటివరకు సుమారు 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగా.. వాటిలో 12 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేశామని అన్నారు. ఈ నెల 26న గురుద్వారలో ‘గ్రేట్‌ ప్లేస్‌ టు వర్క్‌’ సంస్థ సీఈవో బల్బీర్‌ సింగ్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ను అందుకున్నట్టు చెప్పారు.

Updated Date - Jan 29 , 2026 | 04:39 AM