Share News

ఉపాధికి ఖాదీ బోర్డు భరోసా: మంత్రి సవిత

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:03 AM

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు భరోసా ఇచ్చేలా కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత చెప్పారు.

ఉపాధికి ఖాదీ బోర్డు భరోసా: మంత్రి సవిత

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు భరోసా ఇచ్చేలా కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్‌.సవిత చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడంతోపాటు వలసల నివారణ లక్ష్యంతో అర్హులందరికీ స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. యూనిట్ల ఏర్పాటుకు రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో చేనేత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా 2025-26లో లక్ష్యానికి మించి ఉపాధి యూనిట్లు పంపిణీ చేసినట్లు బోర్డు సీఈవో సింహాచలం తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుపై మరింత ప్రచారం చేయాలన్నారు. తొలుత సచివాలయంలోని ఆప్కో, లేపాక్షి ఔట్‌లెట్లను మంత్రి సందర్శించి, అమ్మకాలపై ఆరా తీశారు. సచివాలయ సందర్శకుల అభిరుచి మేరకు చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచాలన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:04 AM