మూలపేట పోర్టు అభివృద్ధికి ఊతం: సీఎం
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:47 AM
నౌపాడ ఉప్పు కర్మాగారం వద్ద 385.24 ఎకరాల సాల్ట్ ల్యాండ్‌ను ఏపీ మారిటైం బోర్డుకు బదిలీ చేయడాని కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అనుమతి..
అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): నౌపాడ ఉప్పు కర్మాగారం వద్ద 385.24 ఎకరాల సాల్ట్ ల్యాండ్‌ను ఏపీ మారిటైం బోర్డుకు బదిలీ చేయడాని కి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అనుమతి ఇవ్వడం మూలపేట పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీనికి కారణమైన ప్రధాని మోదీ, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.