Share News

జగన్‌వి హింసా రాజకీయాలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 06:01 AM

కల్తీ మనుషులు, నకిలీ పార్టీ అయిన వైసీపీకి డ్రామాలు కొత్త కాదని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. సోమవారం ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్‌వి హింసా రాజకీయాలు

  • కోడి కత్తి వైసీపీకి డ్రామాలు కొత్తకావు

  • నాపై వైసీపీ దుష్ప్రచారం: ఎంపీ చిన్ని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కల్తీ మనుషులు, నకిలీ పార్టీ అయిన వైసీపీకి డ్రామాలు కొత్త కాదని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. సోమవారం ఏపీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఆనాడు బాబాయి హత్య కేసు సమయంలో, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా ఆడారు. ఇప్పుడు రాష్ట్రంలో అలజడులు సృష్టించటానికి జగన్‌ డైరెక్షన్‌లో వారి పార్టీ నాయకులు తమ ఇళ్లను తామే తగలబెట్టుకుని నింద వేరే వాళ్లపై వేసే సరికొత్త డ్రామాకు తెరతీశారు. జగన్‌ది హింసాత్మక వైఖరి. లోకేశ్‌ నాయకత్వంలో నా ఆధ్వర్యంలో జోగి ఇల్లు తగలబెట్టారని వైసీపీ చేస్తున్నది దుష్ప్రచారం మాత్రమే. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయంగా అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతీకార రాజకీయాలకు మేం దూరం’ అని చిన్ని పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 06:02 AM