Share News

ఏపీ ఆహార పంపిణీ విధానాలు అభినందనీయం

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:41 AM

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు ఎంతో బాగుందని కేరళం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్‌ జాకబ్‌ అభినందించారు.

ఏపీ ఆహార పంపిణీ విధానాలు అభినందనీయం

  • కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్‌ జాకబ్‌

పెద్దాపురం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు, ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు ఎంతో బాగుందని కేరళం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి అనూప్‌ జాకబ్‌ అభినందించారు. రాష్ట్రంలో ఆహారభద్రత, బియ్యం ప్యాకింగ్‌ విధానాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన ఆయన, కాకినాడ జిల్లా పెద్దాపురంలోని లలిత, పట్టాభి ఆగ్రో ఇండస్ర్టీస్‌ ప్లాంట్లను శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో, రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీలో ధాన్యం సేకరణ, చెల్లింపులు, సరుకుల రవాణా ప్రక్రియ చాలా వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని కొనియాడారు.

Updated Date - Jul 25 , 2026 | 05:44 AM