Share News

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:51 PM

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
‘స్వచ్ఛభారత్‌’ పనుల్లో పాల్గొన్న గుడిసె కృష్ణమ్మ

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ

మంత్రికి గ్రామంలో ’స్వచ్ఛభారత్‌’

ఆదోని, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని మంత్రికి గ్రామంలో ’కృష్ణమ్మ సేవా సైన్యం’ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గుడిసె కృష్ణమ్మ పాల్గొని స్వయంగా పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం పరిసరాలను, ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న డ్రైనేజీలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. అనంతరం గ్రామ ప్రధాన వీధుల్లో చీపురు పట్టి శుభ్రం చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండి సేవ చేయడమే టీడీపీ నైజమన్నారు. గ్రామస్థులు పలు సమస్యలను కృష్ణమ్మ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు గుడిసె శ్రీరాములు, కొత్తూరు సర్పంచ్‌ నాగరాజ్‌, అంబేడ్కర్‌ సొసైటీ చైర్మన్‌ రంగస్వామి, మురళి, మాజీ సర్పంచ్‌ మాధవ్‌, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:51 PM