రైతు బాంధవుడు కేఈ కృష్ణమూర్తి
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:44 PM
మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రైతు బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు.
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
ఘనంగా మాజీ డిప్యూటీ సీఎం
కేఈ కృష్ణమూర్తి పుట్టిన రోజు
వెల్దుర్తి మండలంలో చెరువుల పరిశీలన
వెల్దుర్తి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రైతు బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శుక్రవారం పత్తికొండ, డోన నియోజకవర్గాల వ్యాప్తంగా కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకులను ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల కేక్‌లు కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు.
- వెల్దుర్తి మండలంలోని బోగోలు, ఎల్.కొట్టల చెరువులను మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే పరిశీలించారు. ముందుగా జిల్లా నాయకుడు సుబ్బారాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. వివిధ గ్రామాల నుంచి అశేషంగా నాయకులు, కార్యకర్తల మధ్య 88వ జన్మదిన వేడుకలను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాట్లాడుతూ నాడు డిప్యూటీ సీఎం హోదాలో నియోజకవర్గంలోని 68చెరువులకు సాగునీటిని అందించేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రస్తుతం చెరువులు జలకళ సంతరించుకున్నా యన్నారు. రైతుల పక్షపాతి అని, రైతు బాగుంటే అందరూ బాగుంటారని నమ్మిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి అని అన్నారు. కార్యక్రమంలో చెర్లకొత్తురు పుల్లయ్య, శశికళాధర్, అమర్‌నాథ్‌గౌడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పత్తికొండలో 2కే రన
పత్తికొండ: గాంధీజయంతి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిని లోక్‌నాథ్ ఆద్వర్యంలో పత్తికొండలో శుక్రవారం ఉదయం 2కే రన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు హాజరయ్యారు. జూనియర్ కళాశాల నుంచి అంబేడ్కర్ సర్కిల్‌వరకు 2కేరన సాగింది. విజేతలకు, పాల్గొన్నవారికి జ్ఞాపికలను ఎమ్మెల్యే అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకట్రామ య్య, ఏపీవో వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు కల్పన, సీఐ జయన్న, టీడీపీ నాయకులు వెంకటపతి తదితరులు ఉన్నారు.
శివాలయంలో పూజలు
పత్తికొండ టౌన్: మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పాత శివాల యంలో టీడీపీ నాయకులు పల్లె పవన్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పత్తిపాటి ప్రకాష్, క్రాంతి రవికుమార్, హుల్తెప్ప, రమణ పాల్గొన్నారు.
మద్దికెరలో బ్రెడ్డు పంపిణీ
మద్దికెర: మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ పీహెచసీలో తెలుగు యువత తాలుకా అధ్యక్షుడు ఈడిగ చంద్రశేఖర్‌గౌడు, జిల్లా పరిషత బాలుర పాఠశాల విద్యాకమిటీ చైర్మన ఉప్పర ప్రతాప్ శుక్రవారం బ్రెడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాయినగర్ నెట్టికంటయ్య, ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన విజయ్, సీహెచవో నిరంజనబాబు, తదితరులు పాల్గొన్నారు.
కేఈ సేవలు మరువలేనివి
తుగ్గలి: మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రజా సేవలు మరువలేనివని జిల్లా పరిషత మాజీ చైర్మన బత్తిన వెంకట్రాముడు అన్నారు. శుక్రవారం తుగ్గలి శ్రీరాముల దేవాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జన్మదినం పురస్కరించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నాయకులు వెంకటస్వామి, శ్రీనివాసులు గౌడు, వల్లె వెంకటేశ, వెంకట్రాముడు చౌదరి, మధుబాబు, ఈరమ్మ, చాంద్‌బాషా, రామయ్య యాదవ్, ఎద్దులదొడ్డి రవి పాల్గొన్నారు.