Share News

ఆసియా-పసిఫిక్‌ విద్యామండలి సభ్యుడిగా కత్తి నరసింహారెడ్డి

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:27 AM

ఎడ్యుకేషనల్‌ ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ దేశాల పాలక మండలిలో మాజీ ఎమ్మెల్సీ, ఆలిండియా సెకండరీ టీచర్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కత్తి నరసింహారెడ్డికి చోటు దక్కింది.

ఆసియా-పసిఫిక్‌ విద్యామండలి  సభ్యుడిగా కత్తి నరసింహారెడ్డి
NARASIMHAREDDY

అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎడ్యుకేషనల్‌ ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ దేశాల పాలక మండలిలో మాజీ ఎమ్మెల్సీ, ఆలిండియా సెకండరీ టీచర్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కత్తి నరసింహారెడ్డికి చోటు దక్కింది. ఎడ్యుకేషనల్‌ ఇంటర్నేషనల్‌ ఆసియా-పసిఫిక్‌ దేశాల సదస్సును ఇటీవల జకార్తాలో నిర్వహించగా.. 57 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 12 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహించగా.. జపాన్‌, ఆస్ర్టేలియా మద్దతుతో నరసింహారెడ్డి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇది భారతదేశానికి దక్కిన గౌరవమని, వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విద్యా విధానాలను ఇక్కడ అమలుచేయడానికి కృషి చేస్తానని నరసింహారెడ్డి తెలిపారు.

Updated Date - Oct 19 , 2026 | 04:27 AM