Share News

కాటసానికి మతి భ్రమించింది

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:21 AM

పేదలకు ఇంటి పట్టాలిస్తుంటే సహించలేక మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.

   కాటసానికి మతి భ్రమించింది
బనగానపల్లెలో మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దనరెడ్డి

అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ మాజీ ఎమ్మెల్యే

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి

బనగానపల్లె, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇంటి పట్టాలిస్తుంటే సహించలేక మతి భ్రమించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కాటసాని రామిరెడ్డి అని ఆరోపించారు. తాను గతంలో ఎస్సార్బీసీ స్థలాల్లోని బఫర్‌ జోన వదిలి ఇంటి పట్టాలివ్వాలని వైసీపీ హయాంలో అప్పటి కలెక్టరుకు విజ్ఞప్తి చేశామన్నారు. కాటసాని పేదలకు పట్టాలివ్వకుండా మోసం చేశారన్నారు. కాటసాని రామిరెడ్డిని మించిన అవినీతి పరుడు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారా అని ప్రశ్నించారు. తన సతీమణి ఇందిరమ్మ బనగానపల్లెలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి సొంత నిధులు రూ.55లక్షలతో స్థలం కొనుగోలుచేసి ఇచ్చారన్నారు. ఆమెపై కమలాపురంలో వైసీపీ నాయకులతో విమర్శలు చేయించడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ అంబాల రామకృష్ణారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, మాజీ సర్పంచ తులసిరెడ్డి, బురానుద్దీన, జహంగీర్‌, సొసైటీ చైర్మన అత్తార్‌ అబ్దుల్‌ కలాం, మంచాల మద్దిలేటిరెడ్డి, రాయలసీమ సలాం, ఇస్మాయిల్‌ ఖాన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:21 AM