3 కన్నడ జిల్లాలకు హంద్రీ-నీవా జలాలివ్వండి
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:05 AM
కర్ణాటకలో కరువు ప్రభావిత జిల్లాలైన కోలారు, చిక్కబళ్ళాపుర, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స) పథకం ద్వారా నీరు ఇవ్వాలని కేంద్ర ఉక్కు మంత్రి...
చంద్రబాబుకు కేంద్రమంత్రి కుమారస్వామి వినతి
బెంగళూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కరువు ప్రభావిత జిల్లాలైన కోలారు, చిక్కబళ్ళాపుర, బెంగళూరు గ్రామీణ జిల్లాలకు హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స) పథకం ద్వారా నీరు ఇవ్వాలని కేంద్ర ఉక్కు మంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. ఢిల్లీలో మంగళవారం పార్లమెంటు భవనంలో కేంద్ర మంత్రితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కోలార్ జేడీఎస్ ఎంపీ మల్లేశ్‌బాబు సీఎంకు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం హంద్రీ-నీవా పథకం కింద నీరు సరఫరా చేస్తోందని, వాటిని కోలారు, చిక్కబళ్ళాపుర, బెంగళూరు గ్రామీణ జిల్లాలకూ మళ్లించాలని కోరారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. ఎంపీ వినతిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, దీనిపై తమ అధికారులతో కూలంకషంగా చర్చిస్తానని ఆయన చెప్పారని వెల్లడించారు.