Share News

25న తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి రండి

ABN , Publish Date - Jun 23 , 2026 | 04:12 AM

ఈ నెల 25వ తేదీన తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కర్ణాటక బృందం ఆహ్వానించింది.

25న తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి రండి

  • ముఖ్యమంత్రికి కర్ణాటక బృందం ఆహ్వానం

అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25వ తేదీన తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కర్ణాటక బృందం ఆహ్వానించింది. మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రి ఎస్‌ఎస్‌ బోస్‌రాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బసవన్న గౌడ్‌ బృందం సోమవారం వెలగపూడి సచివాలయంలో సీఎంవో కార్యదర్శి రాజమౌళి, మంత్రులు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ సమక్షంలో సీఎంను కలిసింది. కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి తప్పక హాజరవుతానని చంద్రబాబు తెలిపారు.

అవి ట్రైబ్యునల్‌ పరిధిలోవి: నిమ్మల

అప్పర్‌భద్ర..నవేలి ఎత్తిపోతలకు.. చిక్‌మంచిలి, చికెల్‌ పరిని రోడ్‌ కమ్‌ ఆనకట్ట నిర్మాణాలకు ఆమోదించాలని మంత్రి నిమ్మలను కర్ణాటక బృందం కోరింది. అయి తే.. ఇవి బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ పరిధిలో ఉన్నందున.. దీనిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేమని మంత్రి స్పష్టంచేశారు.

Updated Date - Jun 23 , 2026 | 04:13 AM