కర్లపాలెం ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు కోర్టుకు రావాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:08 AM
తనను పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని...
కస్టోడియల్ టార్చర్ కేసులో హైకోర్టు ఆగ్రహం.. విచారణ 25కు వాయిదా
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): తనను పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విజయబాబు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. బాధితుడి ఒంటిపై ఉన్న గాయాలకు సంబంధించిన ఫొటోలను పరిశీలించిన కోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణలో వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని కర్లపాలెం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, కానిస్టేబుళ్లు బాలకృష్ణారెడ్డి, తిరుపతయ్యలను ఆదేశించింది. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. బాపట్ల జిల్లా, కర్లపాలెం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రేగులగడ్డ విజయబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సీహెచ్ విద్యాసాగర్ వాదనలు వినిపించారు. .