రాజకీయ లబ్ధి కోసం తప్పుడు విమర్శలు: కొత్తపల్లి
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:27 AM
‘వైసీపీ హయాంలో కాపు నేతలపై ఆనేక దౌర్జన్యాలు, ఆక్రమ కేసులు బనాయించారు. అప్పుడు ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఎందుకు స్పందించలేదు? కాపులు పోరాడి సాధించుకున్న..
నరసాపురం, జూన్ 22(ఆంద్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో కాపు నేతలపై ఆనేక దౌర్జన్యాలు, ఆక్రమ కేసులు బనాయించారు. అప్పుడు ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఎందుకు స్పందించలేదు? కాపులు పోరాడి సాధించుకున్న ఐదు శాతం రిజర్వేషన్‌ను రద్దు చేసింది వైసీపీ ప్రభుత్వమే’ అని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. సోమవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘కాపుల సమస్యల కోసం స్పందించాలని ఆ నేతలు నిర్ణయించడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. అయితే రాజకీయ లబ్థి కోసం తప్పుడు విమర్శలు చేయడం, ప్రజల్ని పక్కదారి పట్టించడం సరికాదు. గడిచిన రెండేళ్లకాలంలో ప్రభుత్వం కాపు సంక్షేమం, ఆభివృద్ధికి రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టింది. కూటమి కలిసి ఉన్నంత వరకు వైసీపీ రావడం అసాధ్యం’ అని అన్నారు.