వైసీపీ గుర్తింపును రద్దు చేయాలి: కన్నా
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:14 AM
రప్పా రప్పా నరుకుతాం అంటూ బూతులు తిట్టే వైసీపీ వంటి రాజకీయ పార్టీల గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలి అని మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
గుంటూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘రప్పా రప్పా నరుకుతాం అంటూ బూతులు తిట్టే వైసీపీ వంటి రాజకీయ పార్టీల గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలి’ అని మాజీ మంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గుంటూరులో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు దిగజారుడు భాష మాట్లాడటం దారుణం. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే వైసీపీ ఇలా ప్రవర్తిస్తోంది. వంగవీటి రంగాతో అంబటిని పోల్చటం సిగ్గుచేటు. రంగా ప్రజా నాయకుడు. అంబటి చిల్లర నాయకుడు. అంబటి బూతు మాటలకు కాపు కులానికి సంబంధం ఏమిటి?’ అని కన్నా ప్రశ్నించారు.