కంది రైతుల ఆందోళన
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:50 PM
కర్నూలు మార్కెట్ యార్డులో శుక్రవారం కంది రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధర అందించాలని డిమాండ్
ఫసర్దుబాటు చేసిన సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి
కర్నూలు అగ్రికల్చర్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో శుక్రవారం కంది రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తమకు గిట్టుబాటుఽ ధర రాకుండా చేస్తున్నారని, ఇదేం పద్ధతి అని వ్యాపారులను నిలదీశారు. దీంతో వ్యాపారులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను శాంతింపజేసేందుకు సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్ సెక్రటరీలు రెహిమాన, వెంకటేశ్వర్లు ప్రయత్నించారు. రైతులతో హుటాహుటిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న నాలుగో పట్టణ పోలీసులు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు లేవని రైతుల సమస్యను పరిష్కరిస్తామని సెలక్షన గ్రేడ్ సెక్రటరీ జయలక్ష్మి తెలిపడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం రైతులతో పాటు సిబ్బందితో తన చాంబర్‌లో అత్యవసర సమావేశాన్ని సెక్రటరీ జయలక్ష్మి ఏర్పాటు చేశారు. 12 శాతానికి మించి 16 నుంచి 18 శాతం దాకా తేమ ఉన్నందు వల్లనే ధర తగ్గించినట్లు సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఈ సమావేశంలో సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నగేష్, అకౌంటెంట్ కిషన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.